News July 19, 2024

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CP సునీల్ దత్ 

image

ఖమ్మం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 87126 59111 అందుబాటులో వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.

Similar News

News October 9, 2024

గతంలో మధ్యాహ్న భోజన నిధులు కూడా ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి

image

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇక నుంచి ఏ నెల బిల్లు ఆనెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం ఖమ్మంలో స్పష్టం చేశారు.

News October 8, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 10న దుర్గాష్టమి పండుగ, 11న మహర్నవమి పండుగ, 12న విజయదశమి పండుగ, 13న ఆదివారం సందర్భంగా సెలవులిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 14వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

News October 8, 2024

సింగరేణి కార్మికులకు దసరా విందు ఏర్పాటు చెయ్యండి: డిప్యూటీ సీఎం భట్టి

image

సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేయాలని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు బోనస్ అందజేశామని, సింగరేణిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యక్రమాలను ఎల్ఈడీ తెరల ద్వారా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.