News July 6, 2024
వర్షాల రాకతో సాగు కళకళ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు వానాకాలం సాగుకు ఊతమిస్తున్నాయి. వేసిన పంటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పుడమి తల్లి పచ్చదనంతో మురిసిపోతుంది. దాదాపు ఎండిపోయే స్థితిలో ఉన్న పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రాణం పోస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న, వరి నారుమళ్లు ఇలా వానాకాలం సాగు ఆరంభంలో వేసిన పొలాలన్నీ పచ్చదనంతో మెరుస్తున్నాయి.
Similar News
News December 5, 2025
కోతుల సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్

కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోడు భూముల పట్టా ఉన్నవారు ఎవరైనా అడవి జంతువుల వేటకు పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నించిన గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని చెప్పారు. యువత, పిల్లలను ఆకర్షించేలా అర్బన్ పార్క్లో జంతువులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై ఎక్కడ కూడా కోతులకు ఆహార పదార్థాలు ఇవ్వవద్దని పేర్కొన్నారు.
News December 5, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మూడో రోజు కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ మధుసూదన్ పర్యటన
News December 5, 2025
మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.


