News April 6, 2025
వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రద్దు చేశారు. వచ్చే 48 గంటల పాటు కలెక్టరేట్‌లో 08942-20557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోంపేట మండలంలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
Similar News
News December 19, 2025
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి: శ్రీకాకుళం DEO

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అవసరమని DEO రవిబాబు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని మునిసబేటలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థల ఆవరణలో సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఘనంగా ముగిసింది. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 310 సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. రాష్ట్ర స్థాయికి 11 ప్రాజెక్టులు ఎంపికయ్యారన్నారు.
News December 19, 2025
శ్రీకాకుళం జిల్లా సైనిక అధికారులుకి గవర్నర్ ప్రశంస

విజయవాడలోని లోక్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధికారులును గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళి చేస్తున్న ఉత్తమ సేవలకు గాను గవర్నర్ చేతుల మీదగా సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందుకున్నారు. సేవలు మరింత విస్తృతం చేయాలని గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.
News December 19, 2025
శ్రీకాకుళం: ఒకే కళాశాల నుంచి 25 మందికి అగ్నివీర్ ఉద్యోగాలు

విశాఖ, కాకినాడలో ఆగస్టు నెలలో జరిగిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు సత్తాచాటారు. ఈ అగ్నివీరు రిక్రూట్‌మెంట్‌లో 25 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఇటీవల కాల్ లెటర్స్ వచ్చాయని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్, NCC అధికారి పోలినాయుడు తెలిపారు. వీరిని శుక్రవారం అభినందించారు. NCCలో నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణ, దేహదారుఢ్య శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు.


