News March 19, 2025

వర్సిటీకి ఇక మిగిలేది కేవలం 1400 ఎకరాలే!

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కోసం ప్రభుత్వం 1974లో 2300 ఎకరాలు కేటాయించింది. అయితే వర్సిటీ ఏర్పాటైన 50 ఏళ్లలో వివిధ అవసరాల కోసం 500 ఎకరాలను వెనక్కుతీసుకున్నారు. ఆ తరువాత ఆ భూముల జోలికి రాలేదు. ఇపుడు మరోసారి ప్రభుత్వం HCU వద్ద 400 ఎకరాల లాగేసే ప్రయత్నం చేస్తోంది. అలా చేస్తే ఇక హెచ్సీయూ వద్ద మిగిలేది కేవలం 1400 ఎకరాలే.

Similar News

News November 6, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

News November 6, 2025

HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

image

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్‌ రేంజ్‌లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐ‌ని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.

News November 6, 2025

బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బండి సంజయ్ సభకు అనుమతి రద్దయ్యింది. సా. బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉంది. సభకు అనుమతి ఇచ్చి, ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అడ్డుకొన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సభ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు బోరబండకు చేరుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ లీడర్లు గుర్తుచేశారు.