News November 24, 2024
వర్సిటీలో గంజాయి వినియోగం అవాస్తవం: రిజిస్ట్రార్
తిరుపతి సంస్కృత వర్సిటీలో పలువురు విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై వర్సిటీ రిజిస్ట్రార్ రమాశ్రీ స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో ఏ మాత్రం నిజాలు లేవన్నారు. పలువురు విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడంతో హాస్టల్ గదులను తనిఖీ చేశామన్నారు. అనుమానంతో పలువురుని టెస్టింగ్ కోసం రుయాకు తరలించినట్లు తెలిపారు. యాంటీ డ్రగ్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Similar News
News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
మదనపల్లె: రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని మండలాలకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
CTR: 23 ఉద్యోగాలకు దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.