News May 5, 2024
వలసదారులకు ఓటు వేయవద్దు: మాండ్ర

ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఇతర పట్టణాల నుంచి వచ్చి నందికొట్కూరు నుంచి పోటీచేసే వైసీపీ వలస దారుడైన అభ్యర్థికి ఓటు వేయవద్దని నిత్యం ప్రజల మధ్యనే ఉండే టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్యకు ఓటువేసి గెలిపించాలని నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని శివపురం, లింగాపురం, గోకవరం, ఎదురుపాడు, జడ్వారి పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Similar News
News November 13, 2025
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.
News November 13, 2025
మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
News November 12, 2025
రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


