News January 28, 2025
వలసల నివారణపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

అధికారులు అలసత్వం వీడి వలసల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎంపీడీఓ, ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీవోలను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలు, వలసల నివారణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన చోట సీజనల్ హాస్టళ్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి పనులు కల్పించి వలసలను నివారించాలని సూచించారు.
Similar News
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 20, 2025
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు: కలెక్టర్

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్‌లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో చెల్లింపులు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.
News November 20, 2025
పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సహకంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహంపై దృష్టి సాధించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించారు. పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు, స్థానిక ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించే చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎగుమతుల అవకాశాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.


