News April 9, 2025
వలిగొండ: కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన బొలెరో

వలిగొండ మండలం టేకులసోమారం స్టేజీ వద్ద ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భువనగిరి నుంచి వలిగొండ వైపు వెళ్తున్న బొలెరో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Similar News
News November 6, 2025
విశాఖ: 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం విజ్ఞప్తి చేశారు. విశాఖలో నవంబర్ 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, ప్రాథమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు.
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News November 5, 2025
సామూహిక దీపారాధనలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహించిన సామూహిక దీపారాధన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. కాగా, సామూహిక దీపారాధన కార్యక్రమంలో భాగంగా భక్తులు వివిధ ఆకారాల్లో వెలిగించిన దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


