News March 25, 2025

వలిగొండ: నిందితుడికి కఠిన కారాగార శిక్ష

image

వేములకొండలో 2018లో 15 మంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు A1 వెంకటనారాయణకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష,A2 నాగేశ్వరరావుకు 5 వేల జరిమానా విధిస్తున్నట్లు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతోపాటు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి మూసీ నదిలో పడిపోయింది. ఆ ఘటనలో 15 మంది చనిపోగా 17 మందికి గాయాలయ్యాయి.

Similar News

News December 7, 2025

నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యల్పంగా చారకొండ మండలంలో 15.2 సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 15.5, కల్వకుర్తి, అచ్చంపేట, పదర మండలాల్లో 15.9 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News December 7, 2025

ఖమ్మం: ‘పంచాయతీ’ పోరు ఉద్ధృతం!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1042 పంచాయతీల్లో మూడు విడతల (డిసెంబర్ 11, 14, 17) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గుర్తులు కేటాయించిన తొలి, రెండో విడత అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాత్రి వేళల్లో ఆర్థిక హామీలతో మంతనాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, తమ ఎమ్మెల్యేలు, కీలక నేతలను రంగంలోకి దించడంతో పల్లెపోరు మరింత వేడెక్కింది.

News December 7, 2025

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

image

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.