News March 20, 2025
వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
భూ సమస్యలకు చెక్.. జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్‌లు

భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. ఇవి సింగిల్ విండో సొల్యూషన్స్‌గా పనిచేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రమంతా వీటిని మోడల్‌గా అమలు చేస్తున్నామన్నారు. ప్రజావేదికల తరహాలోనే ఇక్కడ కూడా ఆర్జీలు స్వీకరించి, త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
News January 3, 2026
జూలూరుపాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు..!

జూలూరుపాడు రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. పాపకొల్లులోని సదరు అధికారి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ ఉంచినట్లు తేలడంతో డీఎఫ్ఓ కిష్టగౌడ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ ప్రసాదరావును వివరణ కోరగా సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు ధ్రువీకరించారు.
News January 3, 2026
బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు

వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ చేసిన <<18751661>>ప్రకటన<<>>తో మదురో పేరు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బస్ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి దేశాధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి మదురో. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన, హ్యూగో చావెజ్‌కు అనుచరుడిగా రాజకీయాల్లో ఎదిగారు. చావెజ్ మరణం తర్వాత 2013లో అధ్యక్షుడయ్యారు. అయితే ఆర్థిక సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


