News March 20, 2025

వల్మీడి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

image

పాలకుర్తి మండలం వల్మీడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం పరిసరాలను శుభ్రంగా ఉంచి,తాగునీరు, పారిశుధ్యం, తదితర అందుబాటులో ఉంచాలని సూచించారు.

Similar News

News March 23, 2025

ఈ నెల 31 వరకు గడువు: VZM కలెక్టర్ 

image

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటిఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు ఇంటర్న్ షిప్ పొందవచ్చాన్నారు.

News March 23, 2025

ఆస్పత్రిలో చేరిన అల్లు అర్జున్ నాయనమ్మ

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం (95) ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కాగా కనకరత్నం గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అన్న విషయం తెలిసిందే.

News March 23, 2025

IPL చరిత్రలో అత్యధిక స్కోర్లు ఇవే..

image

287/3 – SRH vs RCB, బెంగళూరు, 2024
286/6 – SRH vs RR, హైదరాబాద్, 2025*
277/3 – SRH vs MI, హైదరాబాద్, 2024
272/7 – KKR vs DC, వైజాగ్, 2024
266/7 – SRH vs DC, ఢిల్లీ, 2024

error: Content is protected !!