News March 21, 2025
వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలపై MLA సమీక్ష

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా జరగబోయే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, రెవెన్యూ, పోలీస్, గ్రామపంచాయతీ, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
కాఫీ పొడితో కళకళలాడే ముఖం

కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం తెలిసిందే. అయితే కాఫీపొడి చర్మసంరక్షణలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. కాఫీపొడి ఫేస్ ప్యాక్‌లతో ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో కాస్త తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని బ్యూటీటిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 27, 2025
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 149 పోస్టులు

రాయ్‌బరేలిలోని<
News October 27, 2025
తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.


