News March 20, 2025
వల్లంపట్ల అమ్మాయికి 70వ ర్యాంక్

ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన దొడ్ల లిఖిత బుధవారం విడుదలైన గేట్ పరీక్ష ఫలితాలలో 70వ ర్యాంకు సాధించారు. ఇదివరకే లిఖిత దిల్లీలో డీఆర్డీవోలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తూ గేట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యి 70వ ర్యాంకు సాధించారు. ర్యాంకు సాధించిన లిఖితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 21, 2025
NRPT: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్

ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అర్హత ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్పించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని చెప్పారు.
News March 21, 2025
మంగళగిరి: సీసీటీవీల పురోగతిపై హోంమంత్రి సమీక్ష

మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తాతో పాటు జిల్లాల ఎస్సీలతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతి, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసుల్లో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు ఇచ్చారు.
News March 21, 2025
సేవా పతకాలకు చిత్తూరు పోలీసులు ఎంపిక

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.