News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. వైసీపీ సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం ఉదయం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఆయనకు మద్దతుగా #WE STAND WITH VALLABHANENI VAMSI’ అంటూ హాష్ ట్యాగ్‌ను Xలో వైరల్ చేస్తోంది.
Similar News
News April 14, 2026
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: అచ్చెన్న

అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దామని మంత్రి అచ్చెన్న అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ కూడలిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడం లక్ష్యమని అచ్చెన్న అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు.
News April 14, 2026
స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఫొటోషూట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు. ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ కవర్ పేజీ కోసం ఆయన వైట్ అండ్ వైట్ సూటులో క్లాసీగా మెరిశారు. ఓడపై దిగిన ఈ ఫొటోలతో పాటు, బ్రౌన్ కలర్ సూటులో ఉన్న మరిన్ని చిత్రాలను మ్యాగజైన్ తన X ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. చరణ్ గ్రేస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
News April 14, 2026
GNT: అమరావతి వరద నివారణ పనులకు టెండర్లు

రాజధాని అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ADCL చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తుతున్న వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.


