News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. LATEST UPDATES

* కృష్ణలంక పీఎస్లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు* కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్న పోలీసులు* వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చే అవకాశం* కృష్ణలంక పీఎస్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య* వల్లభనేని వంశీని కలిసేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు* విశాఖ నుంచి పటమట పీఎస్కు సత్యవర్థన్ను తీసుకొచ్చిన పోలీసులు
Similar News
News May 7, 2025
కృష్ణా: మే 11న ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు

PM సూర్యఘర్ పథకం మంజూరు కోసం జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ఆదర్శ గ్రామాల్లో మే 11వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో CPDCL ఆధ్వర్యంలో PM సూర్య ఘర్ పథకంపై అధికారులు, బ్యాంకర్లకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
News May 7, 2025
పాకిస్తాన్ వ్యక్తులు భారత్ వదిలిపెట్టి వెళ్లాలి: ఎస్పీ

కృష్ణా జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పకుండా 27వ తేదీలోపు భారత్ను విడిపోవాల్సి ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. ఈ నియమాన్ని పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లాలన్నారు.
News May 7, 2025
గ్రామాభివృద్ధిపై డీపీఆర్ తయారు చేయండి: కలెక్టర్

కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను వారం రోజుల లోపు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.