News February 24, 2025
వల్లభనేని వంశీ కేసులో కీలక అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం మూడు రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించాలని సూచించింది. అలాగే వంశీకి వెస్ట్రన్ టాయిలెట్స్, మంచం సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News December 3, 2025
కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం తాత్కాలిక నిలిపివేత

కొమురవెల్లి శ్రీ మల్లన్న దేవాలయంలో డిసెంబర్ 7 సాయంత్రం 8.30 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 6 గంటల వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. డిసెంబర్ 14న స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్లకు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ EO వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అర్ధ మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.
News December 3, 2025
VKB: నామినేషన్ పత్రాలను చోరీ నిందితులపై చర్యలు SP

నామినేషన్ పత్రాలను చోరీ చేసిన నిందితులను వదిలిపెట్టమని ఎస్పీ స్నేహమేరా అన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి నామినేషన్ క్లస్టర్లో చోరీపై ఎస్పీ స్పందించారు. గొట్లపల్లి క్లస్టర్లో తాళం పగలగొట్టి హన్మాపూర్, గిర్మాపూర్, జయరాంతండా(ఐ) గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు చోరీ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.
News December 3, 2025
APPLY NOW: IIFTలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కార్పొరేట్ రిలేషన్స్&కెరీర్ అడ్వాన్స్మెంట్ కోఆర్డినేటర్(3) పోస్టులకు ఈనెల 11వరకు, రీసెర్చ్ అసోసియేట్, కేస్ స్టడీ మేనేజర్ పోస్టులకు ఈనెల 13వరకు, గ్రాఫిక్ డిజైనర్ పోస్టుకు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/PGDBM/PG, PhD, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. వెబ్సైట్: www.iift.ac.in


