News August 14, 2024

వల్లభనేని వంశీ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వంశీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఓటమి తర్వాత విదేశాలకు వెళ్లిన వంశీ అమెరికాలో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసినట్లు సమాచారం.

Similar News

News September 21, 2024

‘యూపీఎస్సీ మెయిన్స్‌కు 128 మంది హాజరు’

image

ఎస్‌ఆర్‌ఆర్‌&సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన యూపీఎస్సీ మెయిల్‌ పరీక్షకు ఏడుగురు గైర్హాజరైనట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. 135 మంది అభ్యర్థులకు గానూ 128 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పటిష్ట బందోబస్తు నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులకు అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తున్నామన్నారు.

News September 20, 2024

రుణాల రీషెడ్యూలింగ్‌ దరఖాస్తులు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్‌ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్‌ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు.

News September 20, 2024

త్రోబాల్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లు ఎంపిక

image

రాష్ట్ర స్థాయి త్రో బాల్‌ పోటీలకు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా త్రో బాల్‌ సంఘం కార్యదర్శి సులోచన తెలిపారు. పురుషుల జట్టుకు రవివర్మ, ప్రమోద్, చరణ్‌తేజ్, చరణ్‌సాయి, యశ్వంత్, రాము, సాయిసంతోష్, రాజ్‌దీప్, జ్యోతివర్మ, అక్షయ్, సూర్య, వెంకటేష్, భాస్కర్, జోసఫ్, అఖిల్, మహిళల జట్టుకు శ్రావణి, జోషిత, సాయిదుర్గ, దక్షిణి, నీరజ, దుర్గ, రితిక ఎంపికైనట్లు చెప్పారు.