News April 15, 2025
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ అప్డేట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ SC, ST కోర్టు మంగళవారం విచారించింది. విచారణలో భాగంగా పటమట పోలీసులు కౌంటర్ సమర్పించారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News November 23, 2025
సాయి సేవా స్ఫూర్తితోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

మన ముందు నడయాడిన దైవం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలతో ‘మానవ సేవే మాధవ సేవ’ అని బాబా నిరూపించారని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానం, సన్మార్గం లభించాయని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం దివ్యాంజలి ఘటించారు.
News November 23, 2025
కొత్తగూడెం: దుప్పి మాంసం కేసు.. రిమాండ్

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దుప్పిని వేటాడి మాంసం విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ శనివారం 14 రోజుల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పి మాంసంతో సహా అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 23, 2025
ములుగు: నేడు సర్పంచ్ రిజర్వేషన్ జాబితా విడుదల..!

సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 10 మండలాల్లోని 146 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను అధికారులు నిర్ణయించారు. అనంతరం నివేదికను కలెక్టర్కు అందజేశారు. నేడు తుది జాబితాను కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఇదే జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.


