News February 13, 2025

వల్లభ నేని వంశీ అరెస్టును ఖండించిన భూమన

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వంశీని అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై ప్రతీకారంతో అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని భూమన సూచించారు.

Similar News

News November 26, 2025

తొలిరోజు ముగిసిన జోగి రమేష్ సోదరుల సిట్ విచారణ

image

నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుల సిట్ (SIT) విచారణ బుధవారం మొదటి రోజు ముగిసింది. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అధికారుల సమక్షంలో గంటపాటు విచారణ కొనసాగింది. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇబ్రహీంపట్నం నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ (A18), జోగి రాము (A19) నిందితులుగా ఉన్నారు.

News November 26, 2025

ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

రైతన్న మీ కోసం కార్యక్రమం స్ఫూర్తితో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, ఇప్పటికే రూ.49.70 కోట్ల విలువైన 20,818 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

News November 26, 2025

కంది: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

image

కంది మండలం కాశీపూర్ కేజీబీవీ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. 100% ఫలితాలు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేక అధికారి ఉన్నారు.