News February 4, 2025
వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.
Similar News
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.
News November 20, 2025
గ్రామాల్లో నేటి నుంచి చీరలు పంపిణీ

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గ్రామాల్లో గురువారం నుంచి పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో 3,66,532 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.
News November 20, 2025
ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.


