News February 4, 2025

వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.

Similar News

News February 12, 2025

బాదేపల్లి మార్కెట్‌లో నేటి ధరలు

image

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.

News February 12, 2025

NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO

image

నిజామాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.

News February 12, 2025

భారత్ భారీ స్కోర్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. గిల్ సెంచరీ(112)తో అదరగొట్టగా శ్రేయస్ 78, కోహ్లీ 52, రాహుల్ 40 రన్స్‌తో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన కెప్టెన్ రోహిత్ ఈసారి ఒక్క పరుగుకే ఔట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లతో సత్తా చాటారు.

error: Content is protected !!