News February 4, 2025

వసంత పంచమి వేళ ధర్మపురి నారసింహుడి ఆదాయం ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం వివిధ కార్యక్రమాల ద్వారా రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటనలో వివరించారు.

Similar News

News October 28, 2025

KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

image

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 28, 2025

కురిక్యాల ఘటనపై MLA సత్యం సీరియస్

image

గంగాధర మండల కురిక్యాల ZPHSలోఅటెండర్ యాకుబ్ పాషా విద్యార్థినుల పట్ల ప్రవర్తించి తీరుపై MLA మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై ఆరా తీసి, అధికారులు, స్కూల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా పాఠశాలలో విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్, సీపీతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 28, 2025

హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

image

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.