News August 21, 2024
వసతి గృహాల ఆకస్మిక తనిఖీ: తూ.గో కలెక్టర్
తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేట్ వసతి గృహాల నిర్వాహకులు తగిన అనుమతులు లేకుండా నిర్వహణా చెయ్యడం, పిల్లల సంరక్షణ కేంద్రాల మార్గదర్శకాలు పాటించకుండా నిర్వహణా వ్యవస్థ ఉండటం గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాలను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, పిల్లల సంరక్షణ వసతి గృహాలను తన ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు.
Similar News
News September 19, 2024
రాజమండ్రిలో పలు రైళ్లకు హాల్ట్ కల్పించిన ద.మ రైల్వే
కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో కోవిడ్ సమయంలో నిలిపి వేసిన పూరి-తిరుపతి, బిలాస్ పూర్-తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొవ్వూరులో హాల్ట్ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి-పూరీల మధ్య ఎక్స్ ప్రెస్ ఐదు రోజులు, బిలాస్ పూర్-తిరుపతి మధ్య రెండు రోజులు రైలు నడుస్తున్నాయి. భువనేశ్వర్ రామేశ్వరం పుదుచ్చేరి-హౌరాల మధ్య ప్రయాణిస్తున్న వారాంతపు ఎక్స్ ప్రెస్‌లకు రాజమండ్రిలో హాల్ట్ కల్పించారు.
News September 19, 2024
ఉండ్రాజవరం: కత్తెరతో భర్తను హత్య చేసిన భార్య
ఉండ్రాజవరం మండలం శివారు రెడ్డి చెరువులో శ్రీనివాసరావు (41) పై భార్య రాణి కత్తెరతో దాడి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అనుమానంతో భార్యని నిలదీయడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై ఘర్షణ తలెత్తడంతో మంగళవారం రాత్రి రాణి తన భర్త గుండెల్లో కత్తెరతో పొడవగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
News September 19, 2024
గోకవరం: ఆర్టీసీ బస్సులో 30 కిలోల గంజాయి సీజ్
గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో గోకవరం పోలీసులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్సులోని అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరి మహిళలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 30 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టామన్నారు.