News December 10, 2024

వసతి గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

వసతి గృహాల నిర్మాణ మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతి లోపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్య అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News January 25, 2025

వైసీపీ నుంచి ఇద్దరు కళ్యాణదుర్గం నేతల సస్పెండ్

image

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇద్దరు నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర, బ్రహ్మసముద్రం జడ్పీటీసీ ప్రభావతమ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర సన్మానం చేసినట్లు తెలుస్తోంది.

News January 25, 2025

9 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి

image

అనంతపురం జిల్లాకు చెందిన 9 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఎస్సైలు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్న పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కాగా వీరందరూ 1991 బ్యాచ్‌కు చెందిన వారు.

News January 25, 2025

అనంతపురం జిల్లాలో మేనమామపై కత్తితో అల్లుడి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కైరేవు గ్రామంలో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. మేనమామ ఆంజనేయులుపై అల్లుడు రంగస్వామి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఇంట్లో కూర్చుని ఉన్న మేనమామ ఆంజనేయులుపై అల్లుడు రంగస్వామి కత్తితో తలపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు.