News June 28, 2024
వసతులపై నివేదిక ఇవ్వండి: చిత్తూరు కలెక్టర్
చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై జులై 7వ తేదీ లోపు నివేదిక అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలోని R&B గెస్ట్‌హౌస్‌లో సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో నివేదిక తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.
Similar News
News December 12, 2024
శ్రీవారి పాదాల మార్గం మూత
తిరుమలలో భారీ వర్షాల కురుస్తోన్న నేపథ్యంలో TTD అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి వారి ఆలయం మార్గంతో పాటు శ్రీవారి పాదాల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిని తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News December 12, 2024
తిరుపతి జిల్లాలోనూ సెలవు
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: చిత్తూరు JC
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.