News February 22, 2025
వాంకిడిలో పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని శుక్రవారం ఉదయం పట్టుకున్నట్లు వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఎస్సైకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో ఎస్సై ప్రశాంత్ పోలీస్ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా బులేరో వాహనంలో మహారాష్ట్రలోని గడ్చిరోలీ వైపు నుంచి హైదరాబాద్ మార్కెట్లో విక్రయించేందుకు 12 ఎద్దులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News November 22, 2025
రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్లతో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News November 22, 2025
పెద్దపల్లి: మళ్లీ మక్కాన్ సింగ్‌కే అవకాశం..!

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోసారి రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్‌కే అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News November 22, 2025
సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎవరంటే!

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా గజ్వేల్‌కు చెందిన తూంకుంట నర్సారెడ్డి కూతురు తూంకుంట ఆంక్షారెడ్డి నియమితులయ్యారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న అధ్యక్ష పదవికి ఎంతో మంది పోటీ పడ్డారు. చివరికి మహిళా నాయకురాలైన ఆంక్షారెడ్డికి అధ్యక్ష పదవి లభించడంతో ఉత్కంఠకు తెర పడింది. 120 మందికి పైగా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.


