News February 14, 2025
వాంకిడి: పశువుల అక్రమ రవాణా.. ఇద్దరికి రిమాండ్

వాంకిడి మండలం టోల్‌ప్లాజా, ఖమానా ఎక్స్ రోడ్డు వద్ద అక్రమంగా పశువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు పరారీలో ఉండగా వారిని వాంకిడి పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. అందులో ఇద్దరికి ఆసిఫాబాద్ మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 3, 2025
ఊట్కూర్: మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ ఇవ్వొద్దని ఫిర్యాదు

ఉట్కూర్ అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో మదాసీ కుర్వలకు ఎస్సీ కుల ద్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దని అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కులం ఇంతకు ముందు బీసీ వర్గానికి చెందినదని, తెలంగాణలో మదాసీ కుర్వ అనే వర్గం లేదని వివరించారు. దీనిపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఫిర్యాదును పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం సభ్యులు శంకర్,కార్యదర్శి కొండన్ భరత్ పాల్గొన్నారు.
News November 3, 2025
మానకొండూరు: పాఠశాల దారి మూసేశారు..!

మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 3, 2025
JEEలో కాలిక్యులేటర్‌ను అనుమతించం: NTA

IIT, NITలలో ప్రవేశాలకు నిర్వహించే JEE మెయిన్‌లో కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పష్టం చేసింది. JEE-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో CBTలో కంప్యూటర్ స్క్రీన్‌పై కాలిక్యులేటర్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనిపై తాజాగా స్పష్టత ఇస్తూ టెస్టులో కాలిక్యులేటర్‌ను నిషేధించినట్లు తెలిపింది. బులెటిన్‌లో తప్పు దొర్లినందుకు విచారం వ్యక్తం చేస్తూ తాజా సవరణ నోట్‌ను వెబ్సైట్లో ఉంచింది.


