News February 10, 2025
వాంకిడి: బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు: ఎస్ఐ

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామని ఎస్ఐ ప్రశాంత్ అన్నారు. వాంకిడి టోల్ ప్లాజా వద్ద వెటర్నరీ వైద్యులతో కలిసి జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలను వెనక్కి తిప్పి పంపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ రవాణాను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 15, 2025
ఇఫ్కో ఛైర్మన్తో సీఎం చర్చలు

విశాఖలో జరుగుతున్న సమ్మిట్లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
News November 15, 2025
కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.


