News February 10, 2025

వాంకిడి: బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు: ఎస్ఐ

image

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామని ఎస్ఐ ప్రశాంత్ అన్నారు. వాంకిడి టోల్ ప్లాజా వద్ద వెటర్నరీ వైద్యులతో కలిసి జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలను వెనక్కి తిప్పి పంపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ రవాణాను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 8, 2026

VZM: విద్యుత్ సమస్యలు ఉన్నాయా?

image

విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఏపీఈపీడీసీఎల్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఈనెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ శనివారం తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు విశాఖలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విజయనగరం, మన్యం జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు అన్నారు.

News February 8, 2026

భాను సప్తమి పూజా విధానం

image

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి, రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజల ఎరుపు రంగు పూలు, ధూపం, దీపం సమర్పించాలి. సూర్య అష్టోత్తరం, గాయత్రీ మంత్రం జపించాలి. గోధుమలతో చేసిన వంటకాలు, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్యుడి దివ్య కాంతిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే మన అడ్డంకులన్నీ తొలగి, ఉన్నత స్థితికి చేరుతామని నమ్మకం.

News February 8, 2026

కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

image

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.