News July 19, 2024

వాంకిడి: భగ్గుమంటున్న టమాటా ధరలు

image

వాంకిడి మండలం కేంద్రంలో గురువారం సాగిన సంతలో టమాట కేజీ రూ.100, పెద్దగా ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ.120కు లభించాయి. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాగా నిన్న, మొన్నటి వరకు అందుబాటులో ఉన్న టమోటా ధర పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

Similar News

News December 1, 2024

లక్షెట్టిపేటలో సీఎం ప్రసంగాన్ని విన్న ఎమ్మెల్యే, కలెక్టర్

image

లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. 

News November 30, 2024

లింగాపూర్‌: ఎంపీడీవో గుండెపోటుతో మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎంపీడీవో రామేశ్వర్ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో అదిలాబాదులోని నివాసంలో ఎంపీడీవో రామేశ్వర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలో జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ లింగాపూర్ మండలానికి ఎంపీడీవోగా సేవ చేసిన రామేశ్వర్ మృతి పట్ల మండల వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

News November 30, 2024

కాగజ్‌నగర్: పెద్దపులితో ముగ్గురు.. ఏనుగుతో ఇద్దరు మృతి

image

కాగజ్‌నగర్ డివిజన్‌లో అడవి జంతువుల దాడిలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 NOV 18న పెద్దపులి దాడిలో దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్ మృతి చెందాడు. అదే నెల 29న కొండపల్లిలో నిర్మల అనే మహిళపై పులి దాడి చేసి చంపేసింది. 2024 ఏప్రిల్‌లో ఏనుగు దాడిలో మరో ఇద్దరు మృతి చెందారు. కాగా నిన్న గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మిపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. నాలుగేళ్లలో ఐదుగురి మృతి కలవరపెడుతోంది.