News August 9, 2024
వాకాడు: ‘జనసేన నేతపై దాడిని ఖండిస్తున్నాం’
వాకాడు మండల జనసేన పార్టీ నేత రౌతు శివకుమార్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షడు, లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు బాధితుడిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండంలోని ఓ పార్టీకి చెందిన నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేయాలన్నారు.
Similar News
News September 19, 2024
నెల్లూరు: ఇంట్లో ఉక్కపోత.. రోడ్డుపై దోమలు
నెల్లూరు రూరల్ తెలుగుగంగా కాలనీ ఎంజీబీ లేవుట్ సమ్మర్ స్టోరేజీ రోడ్డు ప్రాంతంలో తరచూ పవర్ కట్ అవుతుంది. మంగళవారం అర్థరాత్రి పోయిన కరెంట్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. మళ్లీ రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి కావొస్తున్నా కరెంటు రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు దోమలతో ఇబ్బందులు పడ్డారు.
News September 19, 2024
నెల్లూరు: నవంబర్ 10 నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ అన్నారు. కలెక్టరేట్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన్ పునీత్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు, JC అదితి సింగ్, రిక్రూట్మెంట్ అధికారితో సమావేశమయ్యారు. కడపలో ఎంపికలు జరుగుతాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని అన్నారు.
News September 19, 2024
నెల్లూరు: భార్యతో గొడవ.. భర్త సూసైడ్
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మునుస్వామి తెలిపారు.