News October 8, 2024

వాకాడు: టీడీపీ నేత సంచలన ప్రకటన

image

వాకాడు మండలం రాగుంటపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన వాకాడు మండల టీడీపీ బీసీ సెల్ నాయకుడు చెన్నపట్నం జమిందార్ బాబు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన నాయకులను టీడీపీలో చేర్చుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దన్నారు.

Similar News

News November 11, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. సచివాలయ ఉద్యోగి మృతి

image

నెల్లూరు NTR నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి ముజాహిద్దీన్ అలీ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈయన ద్వారకా నగర్-2 వార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు.

News November 11, 2025

కావలి: వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం

image

వృద్ధురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించిన ఘటన కావలి మండలంలో జరిగింది. కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మనోజ్ ప్రభాకర్ వృద్ధురాలి(75) ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.

News November 11, 2025

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది: సోమిరెడ్డి

image

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో లీటర్‌కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు.