News September 9, 2024

వాకాడు: నిమజ్జనానికెళ్లి సముద్రంలో గల్లంతు

image

వినాయక నిమజ్జనం సందర్భంగా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రతీరంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు ఇద్దరిని రక్షించగా.. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సముద్రంలో వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 4, 2024

NLR: బాలికపై లైంగిక దాడికి యత్నం

image

బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటాచలం మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక టిఫిన్ తెచ్చుకునేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 4, 2024

సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్

image

నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 3, 2024

నెల్లూరు: కారు బోల్తా.. ఒకరు మృతి

image

కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.