News February 16, 2025
వాజేడు: ‘వార్డెన్ నిర్లక్ష్యంతోనే ఆదివాసీ విద్యార్థి మృతి’

వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజులు నుంచి 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(14) జ్వరంతో బాధపడుతున్నా హెచ్ఎం, వార్డెన్ ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవరించారని, అతడికి సరైన చికిత్స అందించలేదని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పునెం సాయి మండిపడ్డారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నిర్లక్ష్యంగా ఉన్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 18, 2025
టుడే హెడ్‌లైన్స్

✥ AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు: చంద్రబాబు
✥ ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల
✥ TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే డామినేషన్.. 2వేలకు పైగా స్థానాలు కైవసం
✥ ఐదుగురు MLAల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
✥ ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR
✥ దట్టమైన పొగమంచుతో భారత్-సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు
News December 18, 2025
రెచ్చిపోతున్న బంగ్లాదేశ్.. భారత్‌పై అక్కసు

బంగ్లాదేశ్ అవకాశం చిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతోంది. కొన్ని రోజుల క్రితం ఢాకా వర్సిటీలో PM మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనను దూషించారు. ఈశాన్య రాష్ట్రాలను(7 సిస్టర్స్) తమ దేశంలో కలిపేస్తామంటూ ఇద్దరు టాప్ స్టూడెంట్ లీడర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇవాళ ఢాకాలోని భారత ఎంబసీ వద్ద ఆందోళనకు దిగారు. యూనుస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి కనబడుతోంది.
News December 18, 2025
ఓదెల సర్పంచ్‌గా డా.సతీష్ ఘన విజయం

ఓదెల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా డా.సతీష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు డా.సతీష్‌కు శుభాకాంక్షలు చెప్పారు.


