News February 16, 2025

వాజేడు: విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల రోదన  

image

జ్వరంతో విద్యార్థి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వినీత్(14) మంగళవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో విద్యార్థిని 2రోజులు సెలవులకు హాస్టల్ సిబ్బంది ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం రావడంతో ఏటూరునాగారం తరలిస్తుండగా మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.   

Similar News

News December 4, 2025

సర్వర్ మొరాయింపుతో కౌశలం స్కిల్ టెస్టుకు అడ్డంకి.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా నిర్వహిస్తున్న కౌశలం (కౌన్సిలింగ్) సర్వేకు సంబంధించిన ఆన్‌లైన్ స్కిల్ టెస్ట్ ప్రక్రియ సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర అంతరాయానికి గురైంది. జిల్లాలోని పలు సచివాలయ కేంద్రాలలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

News December 4, 2025

RJY: 13న జాతీయ లోక్ అదాలత్

image

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.

News December 4, 2025

కాకినాడ: రాష్ట్రానికి పర్యాటకుల వెల్లువ

image

‘దేఖో అప్నా దేశ్’ స్ఫూర్తితో రాష్ట్రంలో పర్యాటక రంగం కళకళలాడుతోంది. 2024లో రికార్డు స్థాయిలో 29.2 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఎంపీ సానా సతీశ్ గురువారం పార్లమెంటులో ఆయన అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. పర్యాటక వృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలు దోహదపడ్డాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని మంత్రి తెలిపారు.