News February 16, 2025

వాజేడు: విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల రోదన  

image

జ్వరంతో విద్యార్థి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వినీత్(14) మంగళవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో విద్యార్థిని 2రోజులు సెలవులకు హాస్టల్ సిబ్బంది ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం రావడంతో ఏటూరునాగారం తరలిస్తుండగా మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.   

Similar News

News April 12, 2026

NTR: ట్యాంకర్ కింద BMW.. టెక్నికల్ టీమ్ ఏం తేలుస్తుందో?

image

కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగిన భీకర ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ట్యాంకర్ కారుపై పడటంతో BMW కారు పూర్తిగా నుజ్జునుజ్జైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రమాద తీవ్రతను, సాంకేతిక కారణాలను విశ్లేషించడానికి కంపెనీకి చెందిన సాంకేతిక బృందం ఆదివారం ఘటనా స్థలానికి రానుంది. వాహన ధ్వంసం, ప్రమాద తీరుపై ఈ బృందం లోతుగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.

News April 12, 2026

చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

image

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.

News April 12, 2026

MHBD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

image

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం జరిగింది. మట్వాడ శివారు నీలవంచకు చెందిన చిన్నారులు శ్రీజ(9), చైత్ర(9) చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.