News April 15, 2025
వాజేడు వ్యాప్తంగా కరపత్రాల కలకలం!

ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా గిరిజన యువజన సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, కడేకల్, పేరూరు, వాజేడు పరిధిలోని కొప్పుసురు, మురుమూరు, ప్రగల్లపల్లి ప్రాంతంలో కరపత్రాలు వెలువడటంతో బయానక వాతావరణం ఏర్పడింది. అడవుల్లో బాంబులు గిరిజన గుండెల్లో గుబులు, ఎంత కాలం ఈ అరాచకాలు అంటూ కరపత్రాల్లో రాశారు.
Similar News
News November 22, 2025
బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.
News November 22, 2025
పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.
News November 22, 2025
మాక్ అసెంబ్లీ వివాదం: వైష్ణవికి మంత్రి లోకేశ్ అభయం

నంబులపూలకుంట ZPHS విద్యార్థిని వైష్ణవి కదిరి నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. అయితే, రెండో స్థానంలో ఉన్న గూటిబైలు విద్యార్థి లిఖిత్ రెడ్డిని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేయడంతో వైష్ణవి తల్లిదండ్రులు ట్విటర్ వేదికగా మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ‘డోంట్ వర్రీ వైష్ణవి. నువ్వు మాక్ అసెంబ్లీలో పాల్గొంటావు. నీకు మాట ఇస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు.


