News December 15, 2024
వాజేడు SI హరీశ్ మృతి కేసులో మహిళ అరెస్ట్

వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు కారణమైన అనసూర్య అనే యువతిని వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియాతండాకి చెందిన ఆమె రాంగ్ నెంబర్ ద్వారా ఎస్సై హరీశ్‌కు పరిచయమై, సన్నిహిత్యం పెంచుకుందన్నారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ చనిపోయాడని పోలీసులు తెలిపారు.
Similar News
News October 25, 2025
NLG: టార్పాలిన్ కవర్లు లేక రైతుల తీవ్ర అవస్థలు

నల్గొండ జిల్లాలో టార్పాలిన్ కవర్లు లేక రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ కవర్ల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కిరాయి కవర్ల భారం తడిసిమోపడవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం కవర్లు అందించడం లేదని తెలిపారు.
News October 25, 2025
బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించని రైస్ మిల్లర్లు తక్షణమే వాటిని అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం తడవకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
News October 25, 2025
అవంతిపురంలో రైస్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్

మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో జరుగుతున్న ధాన్యం ప్రాసెసింగ్ విధానాన్ని, బాయిల్డ్ రైసు తయారీని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించాలని మిల్లు యజమానికి కలెక్టర్ సూచించారు.


