News December 28, 2024
వాటితో నాకేంటి సంబంధం: మాజీ మంత్రి బుగ్గన
బేతంచెర్లలో గురువారం అధికారులు పలు గోదాములపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే వాటిలో కొన్ని క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయని, ఆ గోదాములు మాజీ మంత్రి బుగ్గనకు సంబంధించిన వారివిగా గుసగుసలు వినిపించాయి. దానిపై బుగ్గను స్పందిస్తూ .. బంధువులు కొందరు ప్రైవేటు గోడౌన్లు నిర్వహిస్తున్న మాట వాస్తవేమని.. అయితే తనకేంటి సంబంధమంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ విచారణలో ఎవరికి చెందినవో బయటకు వస్తాయన్నారు.
Similar News
News January 1, 2025
మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు!
పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రెండు నెలల కిత్రం సెంచరీ కొట్టిన ధరలు ప్రస్తుతం ₹2 కూడా పలకని పరిస్థితి నెలకొంది. 25కిలోల బాక్సు కేవలం రూ.30కి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కూలీల ఖర్చులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు తదితర మండలాల్లో ఈ పంట సాగు అధికం.
News January 1, 2025
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 1, 2025
వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్కే గిరి
వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా హొళగుంద మండలానికి చెందిన ఎస్కే గిరిని మంగళవారం నియమించారు. ఎస్కే గిరి మాట్లాడుతూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వైస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే విరుపాక్షికి రుణపడి ఉంటానన్నారు.