News February 17, 2025
వాటిపై లోతైన విశ్లేషణ అవసరం: కలెక్టర్

ఒకే సమస్యపై ప్రజల నుంచి పదేపదే వచ్చే వినతులపై లోతైన విశ్లేషణ అవసరమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వస్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష చేశారు. పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందన్నారు.
Similar News
News March 23, 2025
నేడు విశాఖ రానున్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం విశాఖ రానున్నారు. సాయంత్రం 8:55 విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రుషి కొండ వద్ద ఉన్న ఓ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. సోమవారం విశాఖలో ఉండి మంగళవారం సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 23, 2025
విశాఖలో రేపే మ్యాచ్..

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 23, 2025
కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు