News December 29, 2024
వాటిపై 31వరకు అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్ ప్రశాంతి
షెడ్యూల్డ్ కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం డిసెంబర్ 26న సర్వే ప్రారంభమైందని, ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఈ నెల 31 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి శనివారం తెలిపారు. ఫిర్యాదులను VROలు సేకరించి పోర్టల్‌లో డిజిటలైజ్ చేస్తారని, తహశీల్దార్ ద్వారా తుది సమీక్ష పూర్తి చేసి 2025 జనవరి 1న తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 15, 2025
గోసాల ప్రసాద్ మృతి
ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
News January 15, 2025
తూ.గో: పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం శాస్త్రాలు, ముహూర్తాలు ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. ఈ మేరకు కుక్కుట శాస్త్రం ప్రకారం మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు తెలుస్తోంది.
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.