News March 29, 2025

వాట్సప్ గవర్నెన్స్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, స్మార్ట్ ఫోన్ లోనే సులభంగా సేవలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరిట వాట్సప్ గవర్నెన్స్‌ను అమలులోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం 210 సేవలకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గోడ పత్రికల ద్వారా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News April 19, 2025

ములుగు: ఆ స్వామి నాభి చందనం సేవిస్తే.. సంతానం కలుగుతుంది!

image

తెలంగాణలోనే 2వ యాదగిరిగుట్టగా పిలుచుకునే మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6వ శతాబ్దంలోని చోళ చక్రవర్తుల కాలంనాటి నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చెబుతుంటారు. స్వామి వారి బొడ్డు నుంచి కారే ద్రవం(నాభి చందనం)కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమందికి సంతానం కలిగిందని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు.

News April 19, 2025

కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News April 19, 2025

వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు: హైకోర్టు

image

వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మహాభారత కాలంలోలాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్‌లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

error: Content is protected !!