News July 27, 2024
వాట్సాప్‌లో వచ్చే అన్ని లింక్స్ క్లిక్ చేయకండి: ఏలూరు SP

ఏలూరు ప్రజలకు SP ప్రతాప్ శివకిశోర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SBI- Yono Rewards, Union Bank KYC Update, Electricity Bills, Government Schemes Eligibility పేరుతో సైబర్ నేరగాళ్లు APK ఫైల్స్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. వాటిని ఎవరూ షేర్ చేయొద్దన్నారు. ఎవరైతే ఆ APK ఫైల్స్‌పై క్లిక్ చేస్తారో వారి ఫోన్ హ్యాక్ అయ్యి అకౌంట్లోని నగదు ఖాళీ అవుతుందన్నారు.
Similar News
News September 18, 2025
భీమవరం: 5 బార్లను లాటరీ

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్‌కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.
News September 18, 2025
పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News September 18, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.