News April 15, 2025

వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర)పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులను ఆదేశించారు. వాట్సాప్ మన మిత్ర నంబర్ ద్వారా ఛాటింగ్ చేయవచ్చని, ఆ నంబర్ మొబైల్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెట్టడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 161సేవలను ఇంట్లో నుండే పొందవచ్చన్నారు. ఈ యాప్‌పై సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9 సమాధానాలు

image

1. రాముడికి ‘గంగానది’ ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు.
2. దుర్యోధనుడి భార్య ‘భానుమతి’.
3. ప్రహ్లాదుడు ‘హిరణ్యకశిపుడు’ అనే రాక్షస రాజు కుమారుడు.
4. శివుడి వాహనం పేరు నంది.
5. మొత్తం జ్యోతిర్లింగాలు 12. అవి మల్లికార్జునం, సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, కేదారనాథేశ్వరం, భీమశంకరం, నాగేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాథేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం.<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

image

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.

News September 18, 2025

చింతపల్లి: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ వార్డు మెంబర్, శివాలయం అర్చకుడు వాడకాని రాజ్‌కుమార్ (35) నర్సీపట్నం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఘాట్ 2వ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.