News April 4, 2025

వాడపల్లి వెంకన్న సన్నిధిలో కలెక్టర్

image

ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తదితరులు గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Similar News

News December 19, 2025

తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు సిద్దిపేట బిడ్డ

image

జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీలో తలపడే తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు సిద్దిపేట వాసి సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. యశ్వంత్ సిద్దిపేటలోనే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. యశ్వంత్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర జట్టులోకి తీసుకోవడంపై టీఎఫ్‌ఏ సెక్రటరీ ఫాల్గుణ, కోచ్ అక్బర్ నవాబ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు జాతీయ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News December 19, 2025

విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

image

AP: మెడికల్‌ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.

News December 19, 2025

డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

* 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి PM నెహ్రూ ప్రకటన
* 1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
* 1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం(ఫొటోలో)
– గోవా విముక్తి దినోత్సవం