News November 17, 2024
వాడవల్లి: బాలిక పుస్తకాల సంచిలో నాగుపాము

ముదినేపల్లి మండలం వాడవల్లిలో బాలిక పుస్తకాల సంచిలో నుంచి పాము రావడంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. యథావిధిగా శనివారం పుస్తకాల సంచిని తగిలించుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో సంచిలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్నేహితురాలు చూడగా నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు దాన్ని చంపడంతో పెను ప్రమాదం తప్పింది.
Similar News
News October 27, 2025
దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.
News October 26, 2025
కృష్ణా: తుఫాన్ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
News October 26, 2025
కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


