News November 27, 2024
వానాకాలం పోయి యాసంగి వచ్చే.. రైతు భరోసా రాకపోయే: KTR

యాసంగి పోయి వానాకాలం వచ్చింది, వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చింది కానీ రైతు భరోసా రాకపోయే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన రైతు భరోసా మీద వేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో? ఎప్పటి నుంచి ఇస్తారో? అసలు ఇస్తారో, ఇవ్వరో? ఇప్పటి వరకూ స్పష్టత లేదన్నారు.
Similar News
News December 10, 2025
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,450 పలకగా.. బుధవారం రూ.50 తగ్గి రూ.7,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్కు రైతులు 62 వాహనాల్లో 446 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్లో కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.
News December 10, 2025
కరీంనగర్: జీపీ ఎన్నికలు.. పంపిణీ కేంద్రాలివే

గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. ఆయా మండల కేంద్రాల్లో పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చొప్పదండి- ZPHS బాయ్స్, గంగాధర- ZPHS, రామడుగు ZPHS, కొత్తపల్లి ఎలగందల్ ZPHS, కరీంనగర్ గ్రామీణం- ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News December 10, 2025
కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లా పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు ఉచిత దంత వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయించారు. కరీంనగర్ కళా భారతిలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి ఆమె పరిశీలించారు. దంత సమస్యలున్న వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తదుపరి చికిత్స ఉచితంగా లభిస్తుందని తెలిపారు.


