News January 4, 2025
వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News January 8, 2025
KMM: రైతు బీమా సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్
రైతు బీమా, పంటల నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు బీమా పరిహారంలో లోటుపాట్లను సవరించి త్వరతగతిన పూర్తి చేయాలని, అలాగే పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి AEO 25 ఎకరాల ఆయిల్‌పామ్ లక్ష్యం పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, తదితరులు పాల్గొన్నారు
News January 8, 2025
ఖమ్మం: పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్
పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI వివరాల ప్రకారం.. KMM జిల్లా కామేపల్లి మండలం రేపల్లేవాడకు చెందిన నెహ్రూ(23) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. కాగా, వీరి పెళ్లికి యువతి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 3న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 8, 2025
ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు HYD-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-HYDకు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.