News February 15, 2025
వామ్మో ఎండ.. జిల్లాలోనే మేడిపల్లిలో TOP

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో ఎండ దంచి కొడుతోంది. జిల్లాలోని అత్యధికంగా మేడిపల్లిలో ఎండ తీవ్రత ఉన్నట్లు TGDPS తెలిపింది. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా గరిష్ఠంగా మేడిపల్లిలో 36.8° ఉష్ణోగ్రత నమోదైంది. మేడిపల్లి, ఘట్కేసర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Similar News
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
News November 23, 2025
ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.
News November 23, 2025
వికారాబాద్: మార్వాడీల మాయాజాలం.. బంగారంతో మాయం.!

మార్వాడీల మాయాజాలం ప్రజల బంగారంతో మాయమైపోతున్నారు. స్థానిక నాయకుల అందండలతో మార్వాడీ వ్యాపారస్తులు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని పారిపోతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కుల్కచర్ల మండలంలో ఇప్పటివరకు మార్వాడీలు ప్రజలను నమ్మించి బంగారంతో ఉడాయించారు. మార్వాడీలు ప్రజలను తరుచూ మోసం చేసి పారిపోతున్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా ఉండటంతో మార్వాడీలు దోచుకుంటున్నారన్నారు.


