News February 15, 2025
వామ్మో ఎండ.. జిల్లాలోనే మేడిపల్లిలో TOP

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో ఎండ దంచి కొడుతోంది. జిల్లాలోని అత్యధికంగా మేడిపల్లిలో ఎండ తీవ్రత ఉన్నట్లు TGDPS తెలిపింది. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా గరిష్ఠంగా మేడిపల్లిలో 36.8° ఉష్ణోగ్రత నమోదైంది. మేడిపల్లి, ఘట్కేసర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Similar News
News March 19, 2025
కామారెడ్డి: లేఅవుట్ ప్లాట్ల అనుమతులపై నివేదికలు సమర్పించాలి: కలెక్టర్

లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు సంబంధిత శాఖల అధికారులు నివేదికలు స్పష్టంగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో TG బి -పాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు ఆయా శాఖల అధికారుల నివేదికలను సమర్పించాలన్నారు. ఆయా లే అవుట్లు సంబంధిత అధికారులు పరిశీలించి పూర్తి నివేదికలు అందజేయాలన్నారు.
News March 19, 2025
వరంగల్: సెల్ ఫోన్ కాంతులతో దహన సంస్కారాలు!

సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 కావడంతో సెల్‌ఫోన్ వెలుగుల్లో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
News March 19, 2025
కామారెడ్డి: అంకిత భావంతో పనిచేసి మన్ననలు పొందాలి: జిల్లా కలెక్టర్

అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు.